ETV Bharat / state

పోలీసులపై గ్రామస్థుల ఆగ్రహం.. పరిస్థితి ఉద్రిక్తం - villagers

కామారెడ్డి జిల్లా ఆరుగొండలో పోలీసుల తనిఖీలు ఓ యువకుడు ప్రాణం మీదకు వచ్చిందని ఆరోపిస్తూ గ్రామస్థులు పోలీసులపై దాడి చేశారు. ఉద్రిక్తత నెలకొనడం వల్ల అదనపు బలగాలను మోహరించారు.

పోలీసులపై గ్రామస్థుల ఆగ్రహం.. పరిస్థితి ఉద్రిక్తం
author img

By

Published : Jul 10, 2019, 11:00 PM IST

పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీ ఓ యువకుడి ప్రాణాల మీదకు తేవడంతో పాటు ఉద్రిక్తతకు దారి తీసింది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరుగొండలో సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. పోలీసులకు దూరంగా వాహనదారులు వాహనాలు నిలుపుకున్నారు. తనిఖీల అనంతరం ఒక్కసారిగా వాహనాలు వేగంగా వెళ్లాయి. ఇదే క్రమంలో ప్రశాంత్ అనే యువకుడు అదుపు తప్పి ద్విచక్ర వాహనంపై నుంచి పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

పోలీసులే కారణం...

పోలీసులు టార్చ్​లైట్ వెయ్యడం వల్ల యువకుడు అదుపు తప్పి పడిపోయాడని... అయినా వారు పట్టించుకోకుండా వెళ్లిపోయారని ఆరోపిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. సంఘటనా స్థలంలోనే పోలీసులపై దాడికి యత్నించి వారి ద్విచక్ర వాహనం, ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. తనిఖీల పేరుతో పోలీసులు వేధిస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. ఉద్రిక్తత నెలకొనడం వల్ల గ్రామంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.

tg_nzb_09_10_udrikthatha_av_3180033 Reporter: Srishylam.K, Camera: Manoj (. ) పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీ ఓ యువకుడి ప్రాణాల మీదకు తేవడంతో పాటు ఉద్రిక్తతతకు దారి తీసింది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరుగొండలో ఈ సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. దీంతో రెండు వైపులా పోలీసులకు దూరంగా వాహనదారులు వాహనాలు నిలుపుకున్నారు. తనిఖీల అనంతరం ఒక్కసారిగా వాహనాలు వేగంగా వెళ్లాయి. ఇదే క్రమంలో ప్రశాంత్ యువకుడు అదుపు తప్పి ద్విచక్ర వాహనంపై నుంచి పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతన్ని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే పోలీసులు టర్చ్ లైట్ వెయ్యడం వల్ల యువకుడు అదుపు తప్పి పడిపోయాడని... అయినా పోలీసులు పట్టించుకోకుండా వెళ్లిపోయారని ఆరోపిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. సంఘటనా స్థలంలోనే పోలీసులపై దాడికి యత్నించి వారి ద్విచక్ర వాహనం, ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. తనిఖీల పేరుతో పోలీసులు వేధిస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. ఉద్రిక్తత నెలకొనడంతో గ్రామంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు...... vis

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.