కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఆయా గ్రామాల్లో వడగళ్ల వాన, గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని పాల్వంచ, భవానిపేట, పాల్వంచమర్రి, ఇసాయిపేట, మాచారెడ్డి, గజ్యానాయక్‌తండా, కాకులగుట్టతండా, ఘన్‌పూర్(ఎం) గ్రామాల్లో గాలితో కూడిన వడగళ్ల వాన కురిసింది. ఈ అకాల వర్షం వల్ల చెట్లు కూలిపోయాయి. కొమ్మలు విరిగి విద్యుత్ స్థంభాలపై పడి తీగలు తెగిపడ్డాయి. అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం అలముకుంది. వరి పైరు నేలకొరిగి, మామిడి కాయలు రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ఇవీ చూడండి: "రైతుకు కునుకులేకుండా చేస్తున్న వడగళ్లు"