కామారెడ్డి జిల్లా దోమకొండలో రాంచరణ్ భార్య ఉపాసన పర్యటించారు. మూడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అల్పాహార కార్యక్రమం ప్రారంభించారు. ఆహార పదార్థాలు, నియమాల గురించి పిల్లలతో ముచ్చటించారు.
అల్పాహారంతో పాటు రాగిజావను విద్యార్థులకు ఉపాసన స్వయంగా అందించారు. పోషక ఆహారం తీసుకున్నప్పుడే ఆలోచనలు చురుగ్గా ఉంటాయని పిల్లలకు వివరించారు.
దోమకొండ గడీకోట, గ్రామాభివృద్ధి ట్రస్టు ఆధ్వర్యంలో 190 మంది పదో తరగతి విద్యార్థులకు మార్చి 10 వరకు అపోలో ఆహార జాబితా ప్రకారం అల్పాహారం అందించనున్నారు.