విధుల నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌ని.. ఓ వ్యక్తి దుర్బాషలాడడంతోపాటు దాడికి పాల్పడడాన్నిటీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలు ఖండించాయి. కరీంనగర్ డిపో-1 ఆర్టీసీ డ్రైవర్.. కామారెడ్డిలో విధులు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి దాష్టీకానికి పాల్పడ్డాడు. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ కార్మికసంఘాలు డిమాండ్ చేశాయి.
ప్రజల కోసం విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు చేయడం సమంజసం కాదని.. ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
ఇవీ చూడండి: పెళ్లి ఖర్చులకు డ్రా చేసిన డబ్బులు చోరీ.. దొంగ అరెస్ట్