ETV Bharat / state

Drunkards attack: మద్యం మత్తులో యువకుల వీరంగం.. రాళ్లతో పరస్పర దాడి - drunkards fighting in kamareddy

ఇద్దరూ.. ఫూటుగా తాగారు. జనసంచారం ఉన్న రోడ్డులో లొల్లి షురూ చేశారు. మత్తులో చేతికి దొరికిందాంతో దాడి చేసుకున్నారు. రాళ్లురప్పలతో రక్తాలు కారేదాకా కొట్టుకున్నారు. ఎవరు వాళ్లు..? అసలేందుకు కొట్టుకున్నారు...?

మద్యం మత్తులో యువకుల వీరంగం.. రాళ్లతో పరస్పర దాడి
two drunkards fighting in kamareddy and two injured
author img

By

Published : Aug 8, 2021, 4:44 PM IST

మద్యం మత్తులో యువకుల వీరంగం.. రాళ్లతో పరస్పర దాడి

ఎవరో ఇద్దరు యవకులు.. పీకలదాకా తాగారు. ఏ విషయంలోనో ఇద్దరి మధ్య అభిప్రాయభేదం వచ్చింది. అంతే... మత్తులో ఏం చేస్తున్నారో.. ఎందుకు చేస్తున్నారో..? మర్చిపోయి రెచ్చిపోయారు. జనసంచారం ఉన్న రోడ్డులో అందరు చూస్తుండగానే... చేతికి ఏది దొరికితే దాంతో కొట్టుకున్నారు. రక్తాలు కారేలా దాడి చేసుకుని... స్థానికులను కాసేపు భయబ్రాంతులకు గురి చేశారు.

ఈ ఘటన కామారెడ్డిలోని ప్రియ డిలక్స్ రోడ్డులో జరిగింది. మద్యం మత్తులో ఉన్న యువకులు రాళ్ళతో ఒకరికి ఒకరు దాడి చేసుకున్నారు. మందుబాబులు చేసిన వీరంగంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని యువకులను నిలువరించారు. క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించారు. యువకులంతా మద్యం మత్తులో ఉండడం వల్ల ఎలాంటి వివరాలు చెప్పలేకపోతున్నట్టు పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి:

Kidnap: నిర్మల్​లో స్థిరాస్తి వ్యాపారి కిడ్నాప్ కలకలం.. అందుకోసమేనా?

CYBER CRIME: పీఎఫ్​ పేరుతో రూ.9 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.