కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు పూర్తిగా డిపోకే పరిమితమయ్యాయి. ప్రభుత్వా విప్ గంప గోవర్దన్.. తెరాస శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలో తెరిచి ఉన్న దుకాణాలను మూసివేయించారు.
కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గోవర్దన్ అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు కార్పొరేట్ వ్యవస్థలకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. వెంటనే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: బంద్కు ఆర్టీసీ మద్దతు... కదలని బస్సులు