ETV Bharat / state

కూలిన భారీవృక్షం.. రాకపోకలకు అంతరాయం! - బాన్సువాడ ప్రధాన రహదారిపై కూలిన వృక్షం

రోడ్డుపై భారీ వృక్షం నేలకూలడం వల్ల కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని కల్యాణి ప్రాజెక్టు సమీపంలోని బాన్సువాడ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.

Tree Fall down On Road In Kamareddy District
కూలిన భారీవృక్షం.. రాకపోకలకు అంతరాయం!
author img

By

Published : Sep 22, 2020, 7:22 AM IST

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని కల్యాణి ప్రాజెక్టు సమీపంలోని ఎల్లారెడ్డి, నిజాంసాగర్​, బాన్సువాడ ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకూలింది. రోడ్డుకు అడ్డంగా వృక్షం పడి ఉండడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ శశాంక్​ రెడ్డి ఘటనా స్థలానికి జేసీబీ పంపించి నేలకూలిన వృక్షాలు తీయించి రాకపోకలను పునరుద్ధరించారు. సుమారు రెండు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

ఇదీ చదవండి : మంత్రి తలసానికి నిజం తెలియదు.. అందుకే ఛాలెంజ్ చేశారు: భట్టి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.