ముగ్గురు వ్యక్తులు ఓ యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మద్నూర్ మండలం పెద్ద శక్కర్గ గ్రామానికి చెందిన హన్మండ్లు ద్విచక్రవాహనంపై మండల కేంద్రానికి వస్తుండగా.. ముగ్గురు యువకులు వాహనాన్ని ఆపి కత్తితో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. గాయాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వీరంగం సృష్టించారు
ముగ్గురు యువకులు మద్యం మత్తులో ఆ మార్గంలో వీరంగం సృష్టించారని వాహనదారులు తెలిపారు. దాడికి పాల్పడిన ముగ్గురు మహారాష్ట్రకు చెందిన యువకులుగా గుర్తించారు. వారిలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా.. మరొకరు పరారీలో ఉన్నట్లు ఎస్సై రాఘవేందర్ వెల్లడి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: శ్రీలంకతో టెస్టు.. ఇంగ్లాండ్ జట్టులో కరోనా కలవరం!