కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ప్రతిరోజు కుటుంబ సభ్యులను మానసికంగా హింసిస్తున్న తండ్రిని... కొడుకు గొడ్డలితో నరికి చంపాడు.
అసలేం జరిగిందంటే...
తాటిపల్లి మేలయ్య(58)కి ఓ కుమారుడు ప్రశాంత్(25), కూతురు ప్రవళిక(18) ఉన్నారు. కొడుకు ప్రశాంత్‌కు 8నెలల క్రితం వివాహం జరిగింది. అయితే గత కొంత కాలంగా మేలయ్య సైకోగా ప్రవర్తిస్తున్నాడు. కన్న కూతురని చూడకుండా కామంతో చూస్తూ... ఇబ్బంది పెట్టేంత సైకోగా మారాడు.
రాత్రి తండ్రి కొడుకుల మధ్య చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో అందరిని చంపుతానని మేలయ్య.. తన కొడుకుతో అన్నాడు. ఎప్పటికైనా తండ్రి ప్రవర్తనతో ప్రమాదమని భావించిన ప్రశాంత్... ఉదయం 7 గంటల ప్రాంతంలో తండ్రి తలపై గొడ్డలితో బలంగా నరకడం వల్ల అక్కడిక్కడే మృతి చెందాడు.
అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తల్లి, కొడుకు ప్రశాంత్ లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: రెండోరోజు 'ఉద్దీపన'లపై కోటి ఆశలు!