కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల కేంద్రంలోని బెస్తగల్లీలో శనివారం సాయంత్రం దుప్పి సంచారం స్థానికంగా కలకలం రేపింది. పంట పొలాల నుంచి ఒక్కసారిగా రావడంతో బయట కూర్చున్న మహిళలు ఉలిక్కిపడ్డారు. అది దుప్పి అని స్థానికులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.
వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా... రాత్రి 10 గంటల వరకు శ్రమించి దుప్పిని బంధించారు. భిక్నూర్ మండలంలోని తిప్పపూర్ అటవీ ప్రాంతంలో వదిలేశారు.
ఇదీ చదవండి: టెక్రియల్ శివారులో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి