ETV Bharat / state

తాడ్వయి గ్రామంలో విషం తాగి కానిస్టేబుల్​ ఆత్మహత్య

కామారెడ్డి జిల్లా జగద్దిరిగుట్ట పోలీస్​ స్టేషన్​లో పనిచేస్తున్న కానిస్టేబుల్​ హజీ అహ్మద్​ ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం విశ్రాంతి కోసమంటూ ఇంటికి వచ్చి విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.

The constable committed suicide by drinking poison in the village of Tadvai
తాడ్వయి గ్రామంలో విషం తాగి కానిస్టేబుల్​ ఆత్మహత్య
author img

By

Published : Jun 27, 2020, 4:59 AM IST

కామారెడ్డి జిల్లా తాడ్వయి పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ కానిస్టేబుల్​ ఆత్మహత్య చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

కామారెడ్డి జిల్లా తాడ్వాయి గ్రామానికి‌ చెందిన హజీ అహ్మద్ సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలోని జగద్గిరిగుట్ట పోలీస్​ సేషన్​లో విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో విశ్రాంతి తీసుకుంటానంటూ స్టేషన్​ నుంచి ఇంటికి వచ్చారు. సాయంత్రం 6 గంటల సమయంలో కానిస్టేబుల్​ మృతిపై తాడ్వయి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని సీఐ.. జగద్గిరిగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాడ్వాయి గ్రామంలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఆస్పత్రికి తరలించే లోపలే మరణించాడని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ద్రువీకరించినట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.