కరోనా బాధితులు ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో కరోనా సోకిన వ్యక్తి ఇంటి పరిసరాల్లో రసాయనాలు పిచికారి చేశారు. వైద్య, పోలీసు ఇతర శాఖల అధికారులు గ్రామంలో పర్యటించి క్వారంటైన్లో ఉన్న వారికి నిత్యావసరాలు అందించేందుకు 25 మంది సిబ్బందిని నియమించారు.
గ్రామస్థులకు కావాల్సిన సరుకులను మున్సిపల్ సిబ్బంది ద్వారా తెప్పించి ఇస్తున్నారు. అలాగే గ్రామంలోని ప్రధాన రహదారిలో అగ్నిమాపక యంత్రం ద్వారా బ్లీచింగ్ స్ప్రే చేశారు.
ఇదీ చదవండి: 'మీ వల్లే కరోనా ప్రభావిత ప్రాంతాలు పెరిగాయి'