ETV Bharat / state

Telangana Weather News Today : అలర్ట్‌.. అలర్ట్‌.. అలర్ట్‌.. ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. బీ కేర్​ఫుల్ - Hyderabad news

Telangana Weather News Today : తెలంగాణకు వరుణుడి గండం ఇంకా తప్పలేదు. రాష్ట్రంలో నేడూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Telangana Weather Report today
Today Weather Report Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2023, 12:21 PM IST

Updated : Sep 6, 2023, 12:55 PM IST

Telangana Weather News Today : అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో గత 3 రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. నేడు తూర్పు, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్‌లో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

Heavy Rains in Nizamabad District : ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో విస్తారంగా వానలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

ఎల్లో హెచ్చరికలు జారీ అయిన జిల్లాలివే..:

  • ఆదిలాబాద్
  • కుమురం భీం ఆసిఫాబాద్
  • మంచిర్యాల
  • నిర్మల్
  • నిజామాబాద్
  • జగిత్యాల
  • రాజన్న సిరిసిల్ల
  • కరీంనగర్
  • పెద్దపల్లి
  • జయశంకర్ భూపాలపల్లి
  • ములుగు
  • భద్రాద్రి కొత్తగూడెం
  • ఖమ్మం

ఉమ్మడి నిజామాబాద్‌పై 'వరుణ్‌ బ్రో' పంజా..: నిన్నటి వరకు గ్యాప్‌ లేకుండా దంచికొట్టిన వరుణుడు.. నేడు కాస్త తెరిపినిచ్చాడు. ఈసారి కురిసిన వర్షాలు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో తీవ్ర పంటనష్టం వాటిల్లింది. భారీ వర్షాలకు 25 గ్రామాల్లో 1,409 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 791 ఎకరాల్లో వరి, 145 ఎకరాల్లో మొక్కజొన్న, 248 ఎకరాల్లో సోయా, 225 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ బాధిత రైతులు వేడుకుంటున్నారు.

Safety Precautions in Monsoon Telugu : భారీ వర్షాల వేళ బయటకెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు మరవకండి..?

పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు..: 4 రోజులుగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు పడుతున్నాయి. దీంతో చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులన్నీ నిండుకుండల్లా మారగా.. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామ శివారులోని భీమేశ్వర వాగు గుడిపై నుంచి ప్రవహించడంతో వరద నీరు ఆలయంలోకి చేరింది. గాంధారి మండలంలోని పెద్ద వాగు, పాల్వంచ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షానికి బిక్కనూర్ టోల్ ప్లాజా వద్ద రెండువైపులా భారీగా వాహనాలు బారులుతీరుతున్నాయి. తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ శివారులోని వాగు నిన్నటి నుంచి ఉద్ధృతంగా ప్రవహించడంతో ఐదు గ్రామాలైన టేక్రియాల్, చందాపూర్, సంగోజివాడి, కాలోజివాడి, బ్రాహ్మణపల్లి గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.

Heavy Rain Fall in Medak : మెదక్‌ జిల్లాలో కుండపోతగా వర్షాలు.. రోడ్లపైకి వరద నీరు

అత్యవసరమైతేనే బయటకు రావాలి..: జిల్లాలో పలుచోట్ల పదుల సంఖ్యలో పెంకుటిళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. చేలల్లో వర్షపు నీరు నిలవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలైన బతుకమ్మ కుంట, రుక్మిణీ కుంట, పంచాముఖి, అయ్యప్పనగర్, శ్రీరామ్‌నగర్ కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ రోడ్, కొత్త బస్టాండ్, సిరిసిల్ల రోడ్, జేపీఎన్ రోడ్ పూర్తిగా జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. భారీ వర్షాలతో అప్రమత్తమైన జిల్లా అధికారులు.. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు. ఇదే విషయాన్ని పలు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు దండోరా వేయించి ప్రజలను హెచ్చరిస్తున్నారు.

Heavy Rains in Hyderabad Today : భారీ వర్షానికి వణికిన భాగ్యనగరం.. మూసారంబాగ్‌ బ్రిడ్జి మూసివేత

SRSP Gates Opened : మరోవైపు భారీ వర్షాలతో శ్రీరాంసాగర్, నిజాంసాగర్‌ ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. ఎస్సారెస్పీలోకి 89094 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. 21 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి 46 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. 6 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Rain Effect in Hyderabad : దంచికొట్టిన వర్షం.. వణికిపోయిన భాగ్యనగరం.. జనజీవనం అస్తవ్యస్తం

Last Updated : Sep 6, 2023, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.