కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. నాగిరెడ్డిపేట నుంచి లింగంపేటకు బస్సులు నడిపించాలని పలుమార్లు డిపో మేనేజర్‌కు వినతి పత్రాన్ని అందించిన అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా.. అధికారులు స్పందించి మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.
ఇదీ చూడండి : బంద్‌లో వైద్యులు... ఇబ్బందుల్లో రోగులు