ETV Bharat / state

పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : సభాపతి

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పలు అభివృద్ధి పనులను సభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డి పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తి చేసి.. అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

Speaker Pocharam Srinivas Reddy visited Banswada in kamareddy district
పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: సభాపతి
author img

By

Published : Jan 25, 2021, 3:59 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డి పర్యటించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.

ముందుగా పట్టణంలోని నూతన పురపాలక భవనం స్థలం చుట్టూ నిర్మిస్తోన్న ప్రహరీ గోడను, పాత అంగడి బజారులో నిర్మిస్తోన్న నూతన చేపల మార్కెట్​ పనులను పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తి చేసి.. అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎర్రమన్ను కుచ్చ కాలనీలో నూతనంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను పరిశీలించారు.

కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్​ పోచారం భాస్కర్ రెడ్డి, పురపాలక సంఘం ఛైర్మన్ జంగం గంగాధర్, ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రామిరెడ్డి, జడ్పీటీసీ, మార్కెట్ కమిటీ ఛైర్మన్, తెరాస నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఎస్బీఐ చేయూత.. స్వయం ఉపాధి బాటలో యువత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.