కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బోనాల ఉత్సవాలు (bonalu 2021) ఘనంగా నిర్వహించారు. ఇందులో శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి (Pocharam Srinivas Reddy) పాల్గొన్నారు. బోనం(bonam) ఎత్తుకుని అమ్మవార్లకు సమర్పించారు. అమ్మవారి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని..... ప్రజలు కరోనా నుంచి విముక్తి పొందాలని ప్రార్ధించినట్లు వెల్లడించారు. అనంతరం తాడ్కోల్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న రెండు పడకల ఇళ్ల సముదాయాన్ని పరిశీలించారు.
అయితే మొన్నటి వరకు భాగ్యనగరంలో బోనాల పండుగను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. కరోనాతో గతేడాది బోనాలు నిర్వహించుకోలేకపోయారు. ఈ ఏడు రెట్టింపు ఉత్సాహంతో.. అంగరంగవైభవంగా బోనాల పండుగను ప్రభుత్వం జరిపించింది. ఆషాఢం తొలి ఆదివారమైన ఈనెల 11న గోల్కొండ కోటలో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. రాష్ట్ర పండుగగా జరిగే ఈ వేడుకలకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి, గోల్కొండ జగదాంబిక, బల్కంపేట ఎల్లమ్మ, పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయాలు ముస్తాబయ్యాయి. గతేడాది కరోనా నిబంధనలతో సంప్రదాయ ప్రకారం జరిగిన ఉత్సవాలను ఈ ఏడాది అట్టహాసంగానే నిర్వహించారు.
ఇవీ చూడండి: