కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని మంజీర పరివాహక ప్రాంతంలో చెక్‌డ్యామ్ ద్వారా సాగునీటిని అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బాన్సువాడ సమీపంలోని చింతల్ నాగారం ప్రాంతంలో నిర్మించనున్న చెక్‌డ్యామ్ స్థలాన్ని ఆయన పరిశీలించారు.
సంక్షేమాలకు నిలయం
దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే కేవలం తెలంగాణలో మాత్రమే అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయని పోచారం చెప్పారు. రైతులకు సాగునీటిని అందిస్తే పంటలు పుష్కలంగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వెల్లడించారు. నియోజకవర్గంలో నాలుగు చెక్‌డ్యామ్‌ల నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించని ప్రతిపక్షాలు అనవసరంగా విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు.
ఇదీ చదవండి: నాబార్డు ఫోకస్ పేపర్‌ను విడుదల చేసిన మంత్రి హరీశ్‌రావు