పేదవారి ఆత్మగౌరవాన్ని పెంచేందుకే సీఎం కేసీఆర్ రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పులికుచ్చా తాండాలో 10 డబుల్ బెడ్ రూం ఇళ్లను స్పీకర్ ప్రారంభించారు. 1983 కంటె ముందు అనేకతాండాల్లో మట్టి గోడలతో ఇళ్లు నిర్మించుకునే వాళ్లని పోచారం గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ గృహాల్లో చాలా అక్రమాలు జరిగాయని తెలిపారు.
ఖర్చు ఎక్కువైనా సరే... పేదవారికి సౌకర్యవంతమైన ఇళ్లు కట్టించేందుకు సీఎం కేసీఆర్ నిశ్చయించుకున్నారని వివరించారు. దేశంలో ఎక్కడలేని విధంగా 5లక్షల 4వేలతో ఇళ్లు నిర్మించి ఇస్తున్నారని తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలో ఏడాదికి 1000 చొప్పున ఇళ్లు నిర్మిస్తున్నారన్నారు. మొట్ట మొదట కృష్ణానగర్ తండాలో ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 5000 వేల ఇళ్లు తెచ్చినట్లు పోచారం పేర్కొన్నారు. అర్హులైన వారందరికీ ఇళ్లు వచ్చేవిధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.