ETV Bharat / state

Son Killed Mother: అమ్మకు సేవ చేయలేక.. అంతమొందించాడు - Son Killed Mother in Kamareddy

Son Killed Mother in Kamareddy : అనారోగ్యంతో బాధపడుతున్న కన్న తల్లికి సేవలు చేయలేక ఉరేసి ఉసురు తీశాడు ఓ కుమారుడు. ఆ వృద్ధురాలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చి ఆ గ్రామ ఎంపీటీసీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్​ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

Mother Murder
Mother Murder
author img

By

Published : Apr 18, 2023, 1:29 PM IST

Son Killed Mother in Kamareddy : ప్రస్తుత కాలంలో పిల్లలకు తల్లిదండ్రులు భారమవుతున్నారు. కాస్త వృద్ధాప్య ఛాయలు రాగానే వారిని అనాథలుగా వదిలిపెట్టడమో లేక వృద్ధాశ్రమాల్లో చేర్పించడమో చేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులను చూసుకోవడానికి.. డబ్బున్న వాళ్లైతే సేవకులను నియమించుకుంటున్నారు. ఇక పేద వారు.. ఆ వృద్ధులను వారి దైన్యానికి వదిలేస్తున్నారు. కానీ ఓ కుమారుడు ఏకంగా తల్లికి సేవలు చేయలేక ఆమెను అంతమొందించాడు. తనకు ఊపిరి పోసిన కన్నపేగు అని కూడా చూడకుండా ఉరి తీసి ఊపిరి తీశాడు. ఈ అమానుష ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్​ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

Son Killed Mother in Sadashivnagar .. అనారోగ్యంతో బాధపడుతున్న కన్న తల్లికి సేవలు చేయలేక దుర్మార్గానికి ఒడిగట్టాడు ఓ కొడుకు. తల్లి నిద్రిస్తున్న సమయం చూసి చీరతో ఊరేసి హతమార్చాడు. అనంతరం ఎవరికీ తెలియకుండా ఖననం చేసి చేతులు దులుపుకున్నాడు. ఈ అమానుష ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్​ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

Son Killed Mother in Kamareddy District : సదాశివనగర్​కు చెందిన ఇట్టబోయిన బాలవ్వకు (80) సంవత్సరాలు. గత కొంత కాలంగా బాలవ్వ అనారోగ్యంతో బాధపడుతోంది. అరోగ్యం మరింత క్షీణించడంతో మంచాన పడింది. మంచాన పడ్డ తలికి కుమారుడు బాలయ్య సేవలు చేసేవాడు. కొద్దిరోజులకు బాలయ్యకు విసుగొచ్చింది. కన్నతల్లికి సేవలు చేయలేక ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.

ఉరేసి ఉసురు తీశాడు.. ఆమె నిద్రిస్తున్న సమయంలో చీరతో ఉరివేసి హతమార్చాడు. అనంతరం అక్కడే ఓ రైస్ మిల్ వెనక భాగంలో ఖననం చేశాడు. ఈనెల 13 నుంచి బాలవ్వ కనిపించకపోవడంతో ఆ గ్రామ ఎంపీటీసీ బీరయ్యకు అనుమానం వచ్చింది. బాలవ్వ ఎక్కడికి వెళ్లిందని బాలయ్యను అడగ్గా.. తరచూ నిద్రపోతోందని సమాధానం చెప్పేవాడు బాలయ్య. ఇక అనుమానం మరింత బలపడి బీరయ్య పోలీసులకు సమాచారం అందించాడు. బాలయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా తను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. బాలయ్య చెప్పిన వివరాలతో బాలవ్వ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని బాలయ్యను అరెస్టు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.