కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు మంజుల... 300 మంది పాఠశాల విద్యార్థులు, స్థానికంగా ఉన్న నిరుపేదలకు వారం రోజులకు సరిపోయే కూరగాయలు పంపిణీ చేశారు. మధ్యాహ్నం టొమాటో రైస్ పొట్లాలను అందజేశారు.
తన మామ కొండ లక్ష్మయ్య జ్ఞాపకార్థం పేదలకు సహాయం చేస్తున్నామని మంజుల తెలిపారు. గతంలో ఆయన రామారెడ్డిలో ఉపాధ్యాయునిగా పనిచేశారు.
ఇదీ చూడండి: ఊహకందని విషాదం... సాగరతీరం కన్నీటి సంద్రం