నిజామాబాద్ జిల్లాకు చెందిన గంగరాజు, నివాస్‌రెడ్డి ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ నుంచి వస్తున్నారు. కామారెడ్డి పట్టణం టేక్రియాల్ సమీపంలోకి రాగానే వాహనం అదుపుతప్పి కింద పడిపోయారు. ఈ ఘటనలో గంగరాజు అక్కడికక్కడే మృతిచెందగా వెనకాల ఉన్న అయోధ్య నివాస్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు.
పొందుర్తి వద్ద మంద సంతోష్ అనే వ్యక్తి కామారెడ్డి వస్తుండగా ప్రమాదం జరిగి మృతి చెందాడు. నర్సన్నపల్లి ఆర్టీవో కార్యాలయం వద్ద గురురాఘవేంద్ర కాలనీకి చెందిన షాఫిర్ అనే వ్యక్తి బైక్ అదుపు తప్పటం వల్ల ప్రమాదం చోటుచేసుకుంది. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలించారు. దేవునిపల్లి పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.