ETV Bharat / state

హ్యాకింగ్, హనీ ట్రాప్, లీక్.. అసలేం జరిగిందో చెప్పాలి: రేవంత్​రెడ్డి

Revanth Reddy Fired On Minister KTR: టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీను సీబీఐకు అప్పగించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి కోరారు. మంత్రి కేటీఆర్​ తన వాళ్లను కాపాడుకునే పనిలో పడ్డారని ఆరోపించారు. రేపు పేపర్​ లీకేజీ విషయంలో నిరుద్యోగ నిరసన దీక్ష చేయనున్నట్లు పేర్కొన్నారు. కామారెడ్డిలో జరిగిన కార్నర్​ మీటింగ్​లో ఇంకా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

tpcc chief revanth reddy
tpcc chief revanth reddy
author img

By

Published : Mar 18, 2023, 8:21 PM IST

Revanth Reddy Fired On Minister KTR: టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసులో సీబీఐ విచారణ చేస్తే ఇంటి దొంగలు దొరుకుతారనీ ఉద్దేశ్యంతో.. మంత్రి కేటీఆర్ ముందుకొచ్చి అందరినీ కాపాడే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కామారెడ్డి జిల్లాలోని రాజంపేటలో జరిగిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. మంత్రి కేటీఆర్​పై విమర్శలు గుప్పించారు.

పేపర్​ లీకేజీ విషయంలో నేరగాళ్లను విచారించకుండా కేటీఆర్​ నేరుగా ఇద్దరే నిందితులని తీర్పు చెపుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కేసులో వీరి ఇద్దరికీ తప్ప.. మరే ఇంకొకరికీ ఇందులో భాగం లేదని మంత్రి ఎలా చెప్పుతారని ప్రశ్నించారు. వెంటనే మంత్రి కేటీఆర్​ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్​ చేయాలని సూచించారు. పేపర్​ లీకేజీ ఘటనను గతంలో లీకేజీ ఘటనల్లాగానే నీరుగార్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. హ్యాకింగ్, హనీ ట్రాప్, లీక్.. అసలేం ఏం జరిగిందో చెప్పాలని రేవంత్​రెడ్డి డిమాండ్ చేశారు.

గవర్నర్​ను కలవనున్న కాంగ్రెస్​ బృందం: ఈ కేసును సీబీఐకి అప్పగించాలి.. లేదంటే సిట్టింగ్​ జడ్జితో అయినా విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై.. ఈ నెల 21వ తేదీన గవర్నర్​ను కలిసి.. సీబీఐ విచారణకు ఆదేశించాలని గవర్నర్​ను లేఖ రాయనున్నట్లు కోరతామని వివరించారు. టీఎస్​పీఎస్సీ గత ఏడాది నుంచి నిర్వహించిన పరీక్షల అన్నింటిపై విచారణ చేయాలని కోరారు. ఛైర్మన్​, సభ్యులు అందరికీ విచారణ జరిపించాలని.. వారిని విధుల నుంచి తొలగించి.. త్వరలో పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

రేపు నిరుద్యోగ నిరసన దీక్షకు పిలుపు: రేపు టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ వ్యవహారంపై కామారెడ్డి జిల్లా గాంధారిలో నిరుద్యోగుల నిరసన దీక్ష చేపట్టనున్నామని రేవంత్​ రెడ్డి వెల్లడించారు. ఈ దీక్షలో నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

ఈ తొమ్మిదేళ్లలో ఎన్నో లీకేజీలు: 2015లో సింగరేణి నియామకాల్లో బీఆర్​ఎస్​లో ఉండే వారికే ముందే ప్రశ్నపత్రాలు తెచ్చుకుని రాశారని.. కవితకు కూడా ఇందులో సంబంధాలు ఉన్నాయని రేవంత్​రెడ్డి ఆరోపించారు. ఇలాగే 2016లో కూడా ఎంసెట్​, మెడికల్​ ప్రశ్నాపత్రాలు లీకై మూడుసార్లు రాయాల్సి వచ్చిందన్నారు. 2017లో సైతం సింగరేణి ఎలక్ట్రికల్​, మెకానికల్​ నియామకాల్లో ప్రశ్నాపత్రాలు లీకై వారికి సంబంధించిన వారికే ఇచ్చారన్నారు. ఇంటర్​ ప్రశ్నాపత్రాలు దిద్దడంలోనూ నిర్లక్ష్యం వహించారని.. ఆల్​లైన్​ మూల్యాంకనంలో తప్పులు చేయడం కారణంగా 27 మంది మరణించారని చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఈ టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ జరిగిందని మండిపడ్డారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.