ETV Bharat / state

SCHOOL: పుట్టిన ఊరు, అక్షరాలు నేర్పిన బడి పట్ల స్థిరాస్తి వ్యాపారి ఔదార్యం - kamareddy district latest updates

ప్రతిఒక్కరూ ధనార్జనే ధ్యేయంగా బతుకుతున్న వేళ చదువులు చెప్పిన కోవెల పట్ల ఓ స్థిరాస్తి వ్యాపారి ఔదార్యం ప్రదర్శించారు. పుట్టిన ఊరు, చదివిన బడిని పట్టించుకోని కాలంలో చిన్నప్పుడు చదివిన బడికి ఏకంగా రూ.6 కోట్లు కేటాయించారు. బడిని అధునాతన సౌకర్యాలతో నిర్మించారు. అలాగే గ్రామంలోనూ ప్రభుత్వ నిధులకు అదనంగా సొంతంగా డబ్బు వెచ్చించి విల్లాలను తలపించేలా రెండు పడక గదుల ఇళ్లను నిర్మిస్తున్నారు. చదివిన బడి, పుట్టిన ఊరుకు ఉపకారిగా నిలుస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు కామారెడ్డి జిల్లాకు చెందిన స్థిరాస్తి వ్యాపారి సుభాష్ రెడ్డి.

realtor help for school, real estate business men help to village
బడి కోసం స్థిరాస్తి వ్యాపారి ఔదార్యం, ఊరికి సాయం చేసిన స్థిరాస్తి వ్యాపారి
author img

By

Published : Jul 15, 2021, 7:29 AM IST

Updated : Jul 17, 2021, 1:00 AM IST

స్థిరాస్తి వ్యాపారి ఔదార్యం

నేటి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ధనార్జన తప్ప మరొకటి పట్టించుకోవడం లేదు. నిద్ర లేచింది మొదలు సంపాదనే ధ్యేయంగా బతుకుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగమూ అలాంటిదే. అయితే అందరూ అలాగే ఉంటారనుకుంటే పొరపాటే. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామకు చెందిన తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి ఇందుకు ఉదాహరణ. స్థిరాస్తి రంగంలో రాణిస్తూ సొంతూరిపై ప్రేమ, చదువుకున్న పాఠశాల పట్ల మమకారం పెంచుకున్నారు. ఊరు కోసం ఏదైనా చేయాలని కంకణం కట్టుకున్నారు. రూ.6కోట్లతో కార్పొరేట్ స్థాయిలో పాఠశాలను, పేదల కోసం ప్రభుత్వంతో కలిసి రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తున్నారు. తనదైన రీతిలో సినిమా తరహాలో ఊరు కోసం సాయం చేస్తున్న రియల్ ఎస్టేట్ డెవలపర్‌ సుభాష్ రెడ్డి... ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

రూ.ఆరు కోట్లతో..

బీబీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆయన చదువుకున్నారు. దశాబ్దాల కింద నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరింది. విద్యార్థులకు భయం గుప్పిట్లో చదువుతున్నారు. ఈ విషయం గమనించిన ఆయన నూతన భవనం నిర్మించాలని భావించారు. ఇందుకోసం ఏకంగా రూ.6కోట్లు వెచ్చించి కార్పొరేట్ స్థాయిలో పాఠశాల నిర్మించారు.

కొత్త పాఠశాలలో జీ ప్లస్ వన్ విధానంలో భవంతిని నిర్మించాం. ఇందులో మొత్తం 36 గదులు ఉన్నాయి. డిజిటల్ తరగతులు, సైన్స్ ల్యాబ్, గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్, ఉపాధ్యాయులకు విశ్రాంతి గదులు, తాగునీటి సౌకర్యం, మూత్రశాలు.. ఇలా సకల సౌకర్యాలతో నిర్మాణం పూర్తి చేశాం. 2020 అక్టోబర్ 30న సబితా ఇంద్రారెడ్డి ఈ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయగా.. ఎనిమిది నెలల్లోనే నిర్మాణం తుది దశకు చేరింది. త్వరలోనే ఈ పాఠశాలను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాం. ఉన్నదాంట్లోనే నలుగురికి సాయపడాలనే సదుద్దేశంతోనే ఈ పనులు చేస్తున్నా.

-సుభాష్ రెడ్డి, స్థిరాస్తి వ్యాపారి

విల్లాల తరహాలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు

మనం గొప్ప స్థాయిలో ఉండి వేరేచోట ఉన్నా... పుట్టిన ఊరికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి. లేదంటే లావైపోతారు అని ఓ తెలుగు సినిమాలో డైలాగ్. దానినే ఆచరణలో పెట్టారు సుభాష్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండు పడక గదుల ఇళ్లను విల్లాలను తలపించేలా నిర్మిస్తున్నారు. ప్రభుత్వం అందించే రూ.5లక్షలకు అదనంగా మరో రూ.2 లక్షల వరకు తన సొంత నిధులు వెచ్చించి తన సొంతూరు జనగామలో 50 రెండు పడక గదుల ఇళ్లను నిర్మించారు. సుభాష్ రెడ్డి ఔదార్యం పట్ల ఆ ఊరి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అన్నీ సౌకర్యాలు

గేటెడ్ కమ్యునిటీ పద్ధతిలో జీ ప్లస్ టూ విధానంలో ఈ రెండు పడక గదుల ఇళ్లను నిర్మిస్తున్నారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్, భూగర్భ డ్రైనేజీ వంటి ఆధునిక పద్ధతిలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ప్రతి ఫ్లోర్‌నూ పీఓపీ చేయించారు. టైల్స్, మార్బుల్స్ వినియోగించారు. ప్రత్యేకంగా ఎలివేషన్ ఏర్పాటు చేయడంతో ఇళ్లన్నీ విల్లాలను తలపిస్తున్నాయి. జనగామతో పాటు బిక్కనూర్ మండలం జంగంపల్లిలోనూ ఇదే విధంగా రెండు పడక గదుల ఇళ్లను నిర్మించారు. సుభాష్ రెడ్డి స్వగ్రామానికి, చదివిన బడికి చేస్తున్న సేవల పట్ల స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

పురాతనమైనది ఈ పాఠశాల. 60 శాతం శిథిలావస్థకు చేరింది. వర్షం పడితే చాలా విద్యార్థులు, ఉపాద్యాయులు అవస్థలు పడేవారు. వానొస్తే పిల్లలను ఇంటికి పంపించేవారు. ఈ పరిస్థిని చూసిన ఆయన... గొప్ప బడిగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఎంతో ఖర్చు చేసి దేశంలో మంచి పాఠశాలగా గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. అందుకు తగిన విధంగా రూ.6 కోట్లు వెచ్చించి... ఆధునిక సౌకర్యాలతో నిర్మించారు. అంతేకాకుండా విల్లాలను తలపించేలా రెండు పడక గదుల ఇళ్లను నిర్మించారు. సుభాష్ రెడ్డి ఔదార్యానికి ఏం చేసినా తక్కువే. ఆయనకు ఊరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.

-స్థానికులు

స్వగ్రామాలను విడిచి సంపాదన కోసం ఎంతో మంది పట్టణాలు, నగరాలు, విదేశాలకు వెళ్తున్నారు. కానీ సొంతూరు, చదివిన బడి గురించి చాలామంది పట్టించుకోవడం లేదు. తమదైన రీతిలో సాయం చేస్తూ సుభాష్ రెడ్డి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇదీ చదవండి: Lands E-auction: జీహెచ్‌ఎంసీ పరిధిలో 64.93 ఎకరాల భూమి వేలం

Last Updated : Jul 17, 2021, 1:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.