ఉమ్మడి నిజామాబాద్‌లో కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. నిజామాబాద్ నగరంతో పాటు ఆర్మూర్, బోధన్, జక్రాన్‌పల్లి, రెంజల్, నవీపేట మండలాల్లో వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన గాలి వాన కురవగా ప్రజలు ఆహ్లాదంగా సేదతీరారు. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడం వల్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.
కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, రామారెడ్డి, నస్రుల్లాబాద్, సదాశివనగర్, బిచ్కుంద, జుక్కల్, తాడ్వాయి, బీర్కూర్, లింగంపేట, పిట్లం మండలాల్లో వాన కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు తొలగించేందుకు పారిశుద్ధ్య కార్మికులు యుద్ధప్రాతిపదికన పనులను ముమ్మరం చేశారు.