కామారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్ ఎదుట బీజేవైఎం నాయకులు ఆందోళన చేపట్టారు. జిల్లాలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి పర్యటన నేపథ్యంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలంటూ నూతన కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.
ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోగా కాసేపు తోపులాట జరిగింది. దీనితో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: CM KCR: నాలుగు జిల్లాలకు వెటర్నరీ కళాశాలలు మంజూరు