Guns In kamareddy District: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో నాటు తుపాకులు దొరకడం కలకలం రేపింది. సింగీతం అనే గ్రామంలో గంజాయి సాగుచేస్తున్నారని ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందడంతో సోదాలు నిర్వహించగా.. ఆ ప్రదేశంలో ఒక గంజాయి మొక్క రెండు నాటు తుపాకులు లభ్యమయ్యాయి. బాన్స్‌వాడ పోలీసులు.. కొందరు వ్యక్తులు గంజాయి మొక్కలు పెంతున్నారనే సమాచారంతో దాడులు చేయగా నాటు తుపాకులతో పాటు గంజాయి మొక్క దొరికినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: