కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండల కేంద్రంలో ఈనాడు- ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తిరుమల గౌడ్, ఎంపీపీ సదానంద, ఎస్సై రాజేశ్వర్ గౌడ్, ఎమ్మార్వో సతీష్ రెడ్డి, సర్పంచ్ అంజలి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలోని వీధులన్నీ తిరుగుతూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మండల కేంద్రాన్ని ప్లాస్టిక్ రహిత దోమకొండగా మారుస్తామని గ్రామస్థులంతా ప్రతిజ్ఞ చేశారు.
ఇవీ చూడండి: రేపు దిల్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్... ఎల్లుండి ప్రధానితో భేటీ..