కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్‌లో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షం నీటి మాటున కొన్ని ఫార్మా కంపెనీలు ఇదే అదునుగా భావించి కంపెనీ వ్యర్థాలను వాగులు, వంకల్లో వదులుతున్నారు.
ఈ వ్యర్థాలు నీటిలో కలవడం వల్ల అందులో జీవించే చేపల వంటి జీవరాశులు మృత్యువాత పడుతున్నాయి. కలుషితనీరు పంట పొలాల గుండా నీరు ప్రవహించడం వల్ల పంటలన్ని వాడిపోయాయి. ఇది గమనించిన ప్రజలు ఆ కంపెనీ వ్యర్థాలు వాగులలో వదలొద్దని నిరసన వ్యక్తం చేస్తున్నారు.