ETV Bharat / state

క్వారంటైన్​ కేంద్రాన్ని తొలగించాలని కాలనీవాసుల ఆందోళన - kamareddy district news

బాన్సువాడ పట్టణంలోని సాయికృపానగర్​లో కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. కాలనీలోని షెడ్యూల్ తెగల బాలుర వసతి గృహంలో కరోనా రోగుల కొరకు ఏర్పాటు చేసిన క్వారంటైన్​ కేంద్రాన్ని తొలగించాలని డిమాండ్​ చేశారు. తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు.

people-protested-for-quarantine-center-should-be-removed-at-bodhan-in-kamareddy-district
క్వారంటైన్​ కేంద్రాన్ని తొలగించాలని కాలనీవాసుల ఆందోళన
author img

By

Published : Jul 23, 2020, 3:27 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం సాయికృపా నగర్​లోని షెడ్యూల్ తెగల బాలుర వసతి గృహంలో కరోనా రోగుల కొరకు ప్రభుత్వం క్వారంటైన్​ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. తమ కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్​ కేంద్రాన్ని తొలగించాలని కాలనీవాసులు ఆందోళనకు దిగారు. వారు ఆందోళన ఉద్ధృతం చేయడం వల్ల సంఘటన స్థలానికి తహసీల్దార్ చేరుకుని కాలనీవాసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ కాలనీవాసులు వెంటనే ఇతర ప్రదేశానికి మార్చాలని డిమాండ్ చేశారు.

క్వారంటైన్​ కేంద్రాన్ని పట్టణానికి దూరంగా ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేయాలని తహసీల్దార్​కు కాలనీవాసులు వినతిపత్రం సమర్పించారు. తమ ప్రాణాలకు ముప్పు తెచ్చే ఈ కేంద్రాన్ని ఇతర ప్రదేశానికి మార్చాలని కోరారు. లేకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని కాలనీవాసులు తెలిపారు.

ఇవీ చూడండి: 'కరోనాను కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.