కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న ఆందోళనకు శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మద్దతు ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మూడు రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపారు. కార్మికులకు అండగా ఉంటామని.. కాంగ్రెస్ ఎప్పటికీ కార్మికులకు ద్రోహం చేయదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి మాట తప్పారని ఎద్దేవా చేశారు. పొట్ట కూటి కోసం సమ్మె చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని భయపెడుతున్నారని కార్మికులు వాపోయారు. లాభాల్లో ఉన్న ఆర్టీసీని నష్టాల్లోకి కేసీఆరే తీసుకెళ్లారని అన్నారు. బంగారు తెలంగాణ పేరిట కేసీఆర్ కుటుంబమే బంగారమైందని వివరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : ఈఎస్ఐ కుంభకోణం... వెలుగులోకి రోజుకో కొత్త కోణం