ఎగువన కురిసిన వర్షాలతో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. సింగూరు ప్రాజెక్ట్ నుంచి రెండు రోజులుగా వరద నీరు రావడంతో 6 గేట్లు ఎత్తి 45 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
- ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా 1403.66 అడుగులకు చేరుకుంది.
- పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను 15.888 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
- ఎగువ ప్రాంతాల నుంచి 1,19,000 క్యూసెక్కుల వరదనీరు జలాశయానికి వచ్చి చేరుతోంది.
నాలుగేళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'హాథ్రస్' కేసులో తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం