ఈటీవీ భారత్లో "అనాథలుగా చిన్నారులు" శీర్షికన ప్రచురించిన కథనానికి స్పందన లభించింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలానికి చెందిన భవానిపేట్ రాజు, సుజాత దంపతులు రోడ్డు ప్రమాదానికి గురై మరణించగా... వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు.
ఆ కన్నీటి దీనగాథను ఈటీవీ భారత్లో ప్రచురించగా... కథనానికి స్పందించి రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కొండ దేవన్న రూ.1ే0 వేల ఆర్థిక సాయం అందించారు. పిల్లల భవిష్యత్ చదువులకు సైతం తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు.
![ఈటీవీ భారత్ కథనానికి స్పందన... అనాథ పిల్లలకు చేయూత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nzb-12-17-artika-sahayam-av-ts10142_17102020174443_1710f_1602936883_147.jpg)