దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలను ప్రవేశపెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని ఆయకట్టుకు పోచారం జలాశయం నీళ్లను విడుదల చేశారు.
జిల్లాలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాలకు వర ప్రదాయినిగా పేరొందిన పోచారం జలాశయం నీళ్లను రబీ సీజన్లో ఏ, బీ జోన్లుగా విభజించి ఏడాదికి ఒక్క జోన్కు మాత్రమే నీటిని విడుదల చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సీజన్లో ఏ జోన్లో భాగమైన నాగిరెడ్డిపేట మండలంలోని 7 వేల ఎకరాలకు ప్రత్యక్షంగా, మరో 5 వేల ఎకరాలకు పరోక్షంగా నీళ్లందిస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : ప్రియుడి ఘనకార్యం- ప్రియురాలి ఇంటికి సొరంగం