కామారెడ్డి జిల్లా మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే హన్మంత్ షిండే ప్రారంభించారు. పత్తి కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. రైతులు పండించిన తెల్ల బంగారాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని ఆయన పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మార్కెట్ కమిటీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీసీఐ కొనుగోలు కేంద్రంలో క్వింటా పత్తి రూ. 5,550 ధర నిర్ణయించినట్లు ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు.
ఇవీ చూడండి: తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిపై మరో 'పెట్రో' దాడి