అటవీ, రెవెన్యూ శాఖల సమన్వయ లోపంతో పట్టాలు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. అటవీ, రెవెన్యూ భూములున్నా.. కొందరు ఇప్పటి వరకు పట్టాలు రాలేదని తెలిపారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద కొడపగల్‌లో అటవీ, రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్‌తో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. అటవీ, రెవెన్యూ శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాంసాగర్ మండలానికి రానున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకువెళ్లి ప్రజల సమస్య పరిష్కరిస్తానని చెప్పారు.
- ఇదీ చదవండి : రాష్ట్రానికి వడగాలుల హెచ్చరిక