ఎమ్మెల్సీ కవిత జన్మదినం సందర్భంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాదయాత్ర చేశారు. మద్నూర్ నుంచి సరిహద్దు సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయం వరకు మూడు కిలోమీటర్లు పాదయాత్ర చేసి స్వామిని దర్శించుకున్నారు.

ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కేక్ కోసి, మిఠాయిలు పంచుకున్నారు. ఆయనతో పాటు పాదయాత్రలో స్థానిక ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: దిల్లీ సరిహద్దుల్లో రైతుల శాశ్వత నివాసాలు