కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలంలోని రామేశ్వరపల్లి, తిప్పాపూర్, జంగంపల్లి గ్రామాల్లో వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటను ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పరిశీలించారు. నష్టం తీరును వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ గాల్‌రెడ్డి, సర్పంచి స్వామి, ఎంపీటీసీ సాయిరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ కిష్టాగౌడ్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆ జిల్లాల్లో సడలింపులు ఇవ్వొద్దు: వైద్యఆరోగ్య శాఖ