ధాన్యం కొనుగోలు, కరోనా వైరస్ వ్యాప్తిపై కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి... కలెక్టర్ శరత్ కుమార్, ఎస్పీ శ్వేతా, జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
అడ్డగోలుగా తరుగు తీస్తే రైస్ మిల్లుల యజమానులపై క్రిమినల్ కేసులు పెడతామని మంత్రి హెచ్చరించారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. పండించిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు.
ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో ఉండాలని సూచించారు. కరోనాకు మందు లేదని... ఇంట్లో ఉండటమే శ్రీరామ రక్ష అని వ్యాఖ్యానించారు. అత్యవసర సమయాల్లో మాస్కులు ధరించి బయటకు రావాలన్నారు.
ఇవీ చూడండి: ఎక్స్‌రేతో 5 సెకన్లలో కరోనాను గుర్తించే సాఫ్ట్వేర్!