రాష్ట్రంలో ఇంత గొప్పగా పాఠశాల నిర్మించడం హర్షించదగ్గ విషయమని మంత్రి కేటీఆర్(minister KTR) అన్నారు. సొంత ఊరి రుణం తీర్చుకునే అవకాశం అందరికీ రాదన్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలకేంద్రంలో ప్రముఖ వ్యాపార వేత్త సుభాశ్ రెడ్డి తన సొంత ఖర్చులతో నిర్మించిన పాఠశాలను(KTR in School Inauguration) మంత్రి ప్రారంభించారు. పాఠశాల నిర్మాణం కోసం రూ.6.5 కోట్లు వెచ్చించిన వ్యాపారవేత్తను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మా నానమ్మ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను కొత్త హంగులతో నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జనగామలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం జరిగిందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అనేక మౌలిక అంశాలను పరిష్కరించుకున్నామని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మెచ్చే విధంగా రాష్ట్రంలో ఇంటింటికి మిషన్ భగీరథ నీరు ఇస్తున్నామని అన్నారు. విద్యా, వైద్యంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలపడం సీఎం లక్ష్యమని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గోవర్దన్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ జీతేశ్ వి.పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, జిల్లా పరిషత్ ఛైర్మన్ శోభ హాజరయ్యారు.
ఇదీ చూడండి: