ETV Bharat / state

Master Plan Issue in Kamareddy : తెరపైకి 'మాస్టర్​ప్లాన్​'.. కేసీఆర్​పై 100 నామినేషన్లకు సిద్ధమవుతున్న రైతులు - కేసీఆర్​పై నామినేషన్లు వేయనున్న రైతులు

Master Plan Issue in Kamareddy : ఎన్నికల వేళ కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సీఎం కేసీఆర్​ బరిలోకి దిగుతున్న నేపథ్యంలో మాస్టర్‌ ప్లాన్‌ బాధిత రైతులు పోటీకి సిద్ధమవుతున్నారు. 100 మంది కర్షకులు నామినేషన్‌ వెయ్యాలని ఆలోచిస్తుండగా.. మరో వారం రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. ఇప్పటికే లబాన లంబాడీలు నామినేషన్లు వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రైతుల ప్రకటనతో కామారెడ్డిలోనూ నిజామాబాద్‌ పార్లమెంట్‌ నామినేషన్ల పర్వం పునరావృతం కానుందని అనుకుంటున్నారు.

Masterplan Victims Naminations on CM KCR
kamareddy master plan Controversy
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 27, 2023, 9:06 AM IST

Master Plan Issue in Kamareddy తెరపైకి మళ్లీ మాస్టర్​ప్లాన్​ వివాదం.. కేసీఆర్​పై 100 నామినేషన్లకు సిద్ధమవుతున్న రైతులు

Master Plan Issue in Kamareddy : కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్​.. గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి బరిలో నిలవడంతో వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత రేవంత్‌ రెడ్డి సీఎంపై పోటీ చేస్తారని మరోసారి ప్రచారంలోకి ఎక్కింది. మధ్యలో లబాన లంబాడీలు తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని.. లేదంటే నామినేషన్లు వేస్తామని ప్రకటించారు. తాజాగా కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ బాధిత రైతులు నామినేషన్లకు సిద్ధమవుతుండటంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Kamareddy Farmers Nomination Against CM KCR : కొత్త మాస్టర్ ప్లాన్‌లో 8 విలీన గ్రామాలను కలుపుకొని 1,195 ఎకరాల్లో కామారెడ్డి పట్టణాభివృద్ధి పేరుతో ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేశారు. దీనికి వ్యతిరేకంగా రైతులు ఐక్య కార్యాచరణ సమితీగా ఏర్పడి ఆందోళన చేపట్టారు. వీరికి రాజకీయ పార్టీలు మద్దతివ్వటంతో దిగొచ్చిన మున్సిపల్‌ కౌన్సిల్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్‌ ప్లాన్‌ రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది.

అయితే జీఓలో మాత్రం వ్యవసాయ భూములను ఇండస్ట్రియల్ జోన్ నుంచి తొలగించలేదు. మాస్టర్‌ ప్లాన్​ను పూర్తిగా రద్దు చేసే వరకు ఉద్యమించాలని నిర్ణయించుకున్న రైతులు.. ఎన్నికల సమయాన్ని ఆందోళనకు అవకాశంగా భావిస్తున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి నుంచి కేసీఆర్​(KCR)పై పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వారంలోగా కార్యాచరణ ప్రకటించి, గ్రామాల్లో సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు.

Farmers Demand Cancellation of Master Plan : 'మాస్టర్​ ప్లాన్' రద్దు చేయకపోతే.. కేసీఆర్​పై పోటీకి రెడీ

Masterplan controversy in Kamareddy : ముగిసిపోయిందని భావించిన మాస్టర్‌ప్లాన్‌ వివాదం మరోసారి తెరపైకి రావటంతో అధికార పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పరిధిలో మాస్టర్‌ ప్లాన్‌(Kamareddy Master Plan) బాధిత గ్రామాలు ఉండటంతో ఆయా అభ్యర్థులకు ఇబ్బందిగా పరిణమిస్తోంది. కామారెడ్డి నుంచి కేసీఆర్ బరిలో ఉండటంతో స్థానిక నేతలు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూనే.. ప్రతిపక్షాల కుట్రగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో జరిగిన నామినేషన్ల పర్వం పునరావృతం అయ్యే అవకాశం లేకపోలేదు.

Farmers Demands in Kamareddy : గతంలో 178 మంది పసుపు రైతులు బోర్డు డిమాండ్‌ చేస్తూ నామినేషన్లు వేశారు. మరోవైపు తమ భూములు ఇండస్ట్రియల్‌ జోన్లో ఉండటంతో అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. తాత్కాళికంగా పక్కన పెట్టిన మాస్టర్‌ ప్లాన్‌ను పూర్తిగా రద్దు చేయాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే లబాన లంబాడీలు నామినేషన్లకు సిద్ధం కాగా.. ఇప్పుడు అన్నదాతలు అదే బాటలో నడుస్తుండటంతో కామారెడ్డి నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

kamareddy master plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ రద్దు

KA Paul Fires on CM KCR : కేసీఆర్​పై కామారెడ్డిలో పోటీకి నేను సిద్ధం : కేఏ పాల్​

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.