కామారెడ్డి కొల్లూరుకు చెందిన గౌకంటి ధర్మారెడ్డి 3 రోజుల క్రితం ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తండాలోని అత్తగారింటికి వెళ్లారు. రెండు రోజులుగా అక్కడే ఉండి పొలం పనులు చూసుకున్నాడు. శుక్రవారం రాత్రి పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా తండా సమీపంలో పందులు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి కింద పడిపోయాడు.
మార్గం మధ్యలో మృతి
తలకు తీవ్ర గాయాలు కావడం వల్ల ఎల్లారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కుమార్ రాజా తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
ఇవీ చూడండి: కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం: దేశవ్యాప్తంగా ర్యాలీలు