కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్నకోడప్గల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల శివనామస్మరణతో దేవాలయ ప్రాంగణం మార్మోగింది.
త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసం చేసే ఈ ప్రాంతానికి వచ్చాడని ప్రతీతి. ఈ ప్రాంతంలో ఈ శివలింగం కనిపించకపోవడంతో తానే స్వయంగా ఒక లింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారని... ఆ లింగమే రామలింగేశ్వరుడిగా ప్రసిద్ధి పొందింది.
ఇదీ చదవండి : ఆది దంపతులను చూసైనా మనం నేర్చుకోవద్దూ ?