కరెంట్ ఓవర్ లోడ్‌తో బోరు మోటార్లు కాలిపోతున్నాయని ఆరోపిస్తూ లైన్‌మెన్, లైన్ ఇన్‌స్పెక్టర్‌ను సబ్‌స్టేషన్‌లో గ్రామస్థులు నిర్బంధించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేట్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మోటార్లు కాలిపోవడంతో పంటకు నీళ్లు పెట్టలేక పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా నష్టపోయామని వాపోయారు. విద్యుత్ అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: తికమక పెట్టే ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ఎలా చేస్తారో తెలుసా..?