కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రహ్మణపల్లిలో చిరుత సంచారంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. గురువారం గ్రామానికి చెందిన బాలయ్య అనే రైతు మొక్కజొన్న పంట చూసేందుకు వెళ్లేసరికి చిరుత కుందేలును చంపిన ఆనవాళ్లు కనిపించాయి.
బాలయ్య వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు అక్కడికి చేరుకుని కుందేలు మృతి చెందిన ప్రదేశాన్ని పరిశీలించగా చిరుత పులి కాలి ముద్రలను చూసి ఆ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని నిర్ధరణకు వచ్చారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వటంతో నిన్న సాయంత్రం బోనును ఏర్పాటు చేశారు. రైతులు జాగ్రత్త గా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి: రష్యా వేదికగా రక్షణ మంత్రుల భేటీకి చైనా పిలుపు!