ETV Bharat / state

Leopard attack on Goat Nallamadugu : తండాలో చిరుత పులి కలకలం.. ఆందోళనలో స్థానికులు - తెలంగాణ వార్తలు

Leopard attack on Goat Nallamadugu : కామారెడ్డి జిల్లా నల్లమడుగు తండాలో మేకపై చిరుత దాడి చేసింది. మేకలు మేపి... సాయంత్రం వేళ ఇంటికి తీసుకొస్తుండగా ఘటన జరిగింది. చిరుత సంచారంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Leopard attack on Goat Nallamadugu, leopard wandering
తండాలో చిరుత పులి కలకలం
author img

By

Published : Dec 22, 2021, 2:02 PM IST

Leopard attack on Goat Nallamadugu : కామారెడ్డి జిల్లాలో చిరుతపులి దాడి కలకలం రేగింది. లింగంపేట మండలం నల్లమడుగు తండాకు చెందిన దూప్‌సింగ్‌... ఉదయం మేకలను మేత కోసం సమీపంలోని అడవికి తీసుకెళ్లాడు. సాయంత్రం మేకలను ఇంటికి తీసుకొస్తుండగా గ్రామశివారులో చిరుత దాడిచేసిందని తెలిపాడు. ఆ దాడిలో మేక చనిపోయిందని చెప్పాడు. వెంటనే అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు.

తండాకు చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతపులి పాదముద్రలు సేకరిస్తున్నారు. అడవిలోకి మేకలను మేపడానికి వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు సూచించారు. చిరుతపులి గ్రామంలోకి ప్రవేశించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

ఇదీ చదవండి: Harish rao comments on Piyush Goyal: 'రైతులకు పీయూష్‌ గోయల్‌ తక్షణమే క్షమాపణలు చెప్పాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.