కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం డోంగ్లి జిల్లా పరిషత్ పాఠశాలలో చదివే విద్యార్థులు ఆన్లైన్ పాఠాలు వినేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న శివరాజ్ పాటిల్ అనే వ్యక్తి వారికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. పాఠశాలకు 30 వేల నగదుతోపాటు మూడు ఎల్ఈడీ టీవీలను అందజేశారు. పేద విద్యార్థులకు సాయం చేసిన శివరాజ్ పాటిల్‌ను గ్రామస్థులు అభినందించారు.
గతంలోనూ శివరాజ్ లక్షలు విలువ చేసే పరికరాలను పాఠశాలకు అందజేశారని, విద్యార్థులకు సాయం చేయడంలో ఎప్పుడూ ఆయన ముందుంటారని ఉపాధ్యాయులు తెలిపారు.
- ఇదీ చూడండి: ముఖర్జీ మరణంపై ఆరెస్సెస్, భాజపా విచారం