కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని సింగీతం ప్రాజెక్టు అలుగుపారుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం (416.550 మీటర్లు) చేరుకోవడం వల్ల గేట్ల ద్వారా 1,600 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రధాన కాల్వలోకి వదిలారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండటం వల్ల అలుగు ద్వారా 500 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతంలోకి వెళుతున్నాయి.
కల్యాణి ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో (409.50 మీటర్లు) నిండి ఒక గేట్ ద్వారా 70 క్యూసెక్కుల నీటిని మంజీర కాల్వలోకి వదిలారు. ప్రధాన కాల్వ ద్వారా 320 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ కాల్వలోకి వదిలారు.