కొవిడ్ కారణంగా ఉగాది, శ్రీరామ నవమి, బోనాలు లాంటి ఉత్సవాలను జరుపుకోలేకపోయామని.. ఇలాంటి తరుణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరపడమూ కష్టమేనని కామారెడ్డి జిల్లా విశ్వహిందు పరిషత్ అధ్యక్షులు గోపాలకృష్ణ వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టు 22న ప్రారంభమై సెప్టెంబర్ 1వ తేదీతో ముగిసే వినాయక ఉత్సవాలను నిరాడంబరంగా జరుపుకోవడమే సముచితంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య మార్గదర్శకాలకు అనుగుణంగా ఎవరి ఇళ్లలో వారే గణేష్ చతుర్థిని జరుపుకోవడం అందరికీ శ్రేయస్కరమని గోపాలకృష్ణ వెల్లడించారు. ఒకవేళ మండపాలను ఏర్పాటు చేస్తే.. భక్తుల సంఖ్య తక్కువ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ శానిటైజర్లు ఉపయోగిస్తూ మాస్కులు ధరిస్తూ ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. ఉత్సవాలపై ఆధారపడి జీవనం సాగించే వివిధ వృత్తి కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: హైదరాబాద్కు 200 టన్నుల అమోనియం నైట్రేట్!