కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామంలో పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన పారిశుద్ధ్య పనులను కలెక్టర్ శరత్ పరిశీలించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించి మెచ్చుకొన్నారని తెలిపారు. మంకీ ఫుడ్కోర్ట్లో నాటిన మొక్కల వాడిన దశలో ఉండటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొక్కలను బతికించుకోవడానికి ప్రత్యేకంగా.. గొట్టాపు బావి వేసుకోవాలని కలెక్టర్ శరత్ రైతులకు సూచించారు. చీడలు, ఇతర వ్యాధులు సోకకుండా ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడాలని పేర్కొన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ పరిధిలో పదో తరగతి పరీక్షలు వాయిదా