ETV Bharat / state

వైద్య సిబ్బందితో కలెక్టర్​ శరత్​ సమీక్ష - collector sarath review

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో వైద్య సిబ్బందితో కలెక్టర్​ శరత్​ సమీక్షించారు. క్వారంటైన్​లో ఉన్నవారి ఆరోగ్య స్థితిని గమనిస్తూ.. ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు.

kamareddy collector
వైద్య సిబ్బందితో కలెక్టర్​ శరత్​ సమీక్ష
author img

By

Published : Apr 18, 2020, 11:09 PM IST

కంటైన్​మెంట్​ జోన్​, హాట్​స్పాట్​లలో రోజూ వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ సర్వే చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్​ శరత్​ సూచించారు. బాన్సువాడలోని ఎంపీడీవో కార్యాలయంలో వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. క్వారంటైన్​లో ఉన్నవారి ఆరోగ్య స్థితిని పరిశీలిస్తూ ఉండాలని ఆదేశించారు.

ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు జరిగేలా చూడాలని సిబ్బందికి సూచనలు చేశారు. చిన్న పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్​, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ పవర్ నందలాల్, డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా వైద్య అధికారి చంద్రశేఖర్, ఆర్డిఓ రాజేశ్వర్, డీఎస్పీ దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇవీచూడండి: మెడికల్​ దుకాణాల్లో మందులు కొన్నవారికి కరోనా పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.